ఒక్క క్లిక్ తో గ్రామ వాలంటీర్ల దరఖాస్తు

ఏపీ 13 జిల్లాల్లో 1,84,498 మంది గ్రామ వాలంటీర్ల నియామకాలకు జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అవసరాన్ని బట్టి వాలంటీర్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు నుండి gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది.

దరఖాస్తు ఐదు దశల్లో వుంటుంది. మొదటి దశలో ధ్రువీకరణ.. ప్రాంతం, విద్యార్హత, పుట్టిన తేదీ ఆప్షన్లు వుంటాయి. రెండో దశ .. ఆధార్‌ లింక్.. మూడో దశ: వ్యక్తిగత సమాచారం .. నాలుగో దశ: విద్యార్హత, అయిదో దశ: సామాజిక వివరాలు జతచేయాల్సి వుంటుంది. పూర్తి వివరాలకు gramavolunteer.ap.gov.in సంప్రదించండి.