టీడీపీ నాయకులను వదిలిపెట్టని ఐటీ దాడులు..


వారం రోజులుగా ఐటీ అధికారులు తెలుగు దేశం నాయకులను చెమటలు పట్టిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు నాయకుల ఇళ్లలో సోదాలు చేస్తూ వారికీ నిద్ర లేకుండా చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు సంబందించిన ఆఫీస్ లలో , ఇళ్లలో ఏకకాలం లో సోదాలు నిర్వహించడం మొదలు పెట్టారు. రమేశ్ స్వగ్రామం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆయనకు చెందిన కంపెనీల కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

మొత్తం 60 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రమేశ్.. మధ్యాహ్నంలోగా హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడిన రమేష్ కేంద్రం ఫై మండిపడ్డారు. టీడీపీ, ఆ పార్టీ నేతలపై కేంద్రం కక్షగట్టిందని , కడప ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేవలం ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకే కేంద్రం కుట్రలు చేస్తోందని సీఎం మండిపడ్డాడు.