ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ ఖరారు..

క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించే ఐపీఎల్ సీజన్ మొదలు కాబోతుంది. ఐపీఎల్ 2019 సీజన్ కు సంబందించిన షెడ్యూల్‌ ను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 23 నుంచి ఈ సీజన్ మొదలు కానుండగా .. ఏప్రిల్ 5 వరకూ మొత్తం 17 మ్యాచ్‌లకి సంబంధించిన షెడ్యూల్ ను మంగళవారం విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు వచ్చిన తర్వాత.. దానికి అనుగుణంగా.. మొత్తం షెడ్యూల్‌ని ప్రకటించనున్నట్లు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

ఇక ఈరోజు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 14 రోజుల షెడ్యూల్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనుండగా.. టోర్నీలోని ఎనిమిది జట్లు.. నాలుగేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. వాటిలో రెండు మ్యాచ్‌లు సొంతగడ్డపై.. మిగిలిన రెండు ప్రత్యర్థి సొంత మైదానంలో జరగనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మాత్రం ఐదేసి మ్యాచ్‌‌లు ఆడనుండగా.. సొంతగడ్డపైనే మూడు మ్యాచ్‌లు ఆడేలా షెడ్యూల్‌ విడుదలైంది.