జయరామ్ హత్యకేసులో కొత్త ట్విస్టులు

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో కొత్త ట్విస్టులు వెలుగులోనికి వస్తున్నాయి. రాకేశ్‌రెడ్డి, జయరా‌మ్‌కు మధ్య రూ.4.5కోట్ల లావాదేవీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అంతేకాదు.. జయరామ్ నుంచి దాదాపు రూ. 100కోట్లు కొట్టేయాలనే ఉదేశంతో ఆయన్ని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారమ్. ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు చేయించుకుని ఆ తర్వాత జయరామ్ ని దారుణంగా హతమార్చాడు రాకేష్.

ఈ హత్యలో ఐదుగురు పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్‌.ఆర్‌.నగర్‌కు చెందిన నగేశ్‌, విశాల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరికి రాకేశ్‌రెడ్డితో పరిచయం ఉందని.. హత్య జరిగిన రోజు రాకేశ్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈకేసులో ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకొంది. మరో ముగ్గురు పోలీసు అధికారులతో రాకేశ్‌రెడ్డి ఫోన్‌లో సంభాషించినట్లు సమాచారమ్.