కోజికోడ్ ప్రమాదం ఫై మహేష్ దిగ్బ్రాంతి ..

కేర‌ళ‌లోని కోజికోడ్ కరీపూర్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దుబాయ్‌ నుంచి వందేభారత్‌ మిషన్‌లో భాగంగా వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వే పై నుంచి జారి 35 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌, కోపైలట్‌తోపాటు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 120 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 7.41 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన అందర్నీ కలిచి వేస్తుంది.

కాగా ఈ ఘటనపై మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సంఘటన పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ లో ”కోజికోడ్ విమానప్రమాద ఘటన కలచివేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికిని నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడివారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.

Deeply saddened by the news of #KozhikodeAirCrash. My condolences to all the families and friends of those who lost their lives in the unfortunate incident. Prayers for a speedy recovery of all those injured. ?— Mahesh Babu (@urstrulyMahesh) August 8, 2020