ఉగ్రదాడిలో ఎమ్మెల్యే మృతి


ఉగ్రవాదులు అరుణాచల్‌ ప్రదేశ్‌లో కలకలం సృష్టించారు. ఎన్‌పీపీ ఎమ్మెల్యేని కాల్చి చంపారు. వివరాల్లోకి వెఌతే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖోన్సా పశ్చిమ నియోజక వర్గం నుంచి ఎన్‌పీపీ తరఫున మరోసారి పోటీ చేసిన తిరోంగ్‌ అబో.. మంగళవారం అసోం నుంచి తన నియోజక వర్గంలోని ఓ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడి జరిపారు. ఎమ్మెల్యేతో పాటు మరో 10 మందిని కాల్చి చంపారు. వీరిలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, ఇద్దరు భద్రతా అధికారులు ఉన్నారు.

ఈ ఘటనపై స్పందించిన ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాద్‌‌ సంగ్మా.. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ‘ఈ వార్త తెలుసుకొని ఎన్‌పీపీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడి జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, పీఎంవోను కోరుతున్నామని ట్వీట్‌ చేశారు.