అనీల్ ఆస్తుల పై ముకేశ్ అంబానీ చూపు…!

అప్పుల్లోమునిగిపోయిన సోదరుడిని ఆదుకునేందుకు మరోసారి అన్న రంగంలోకి దిగనున్నారని తెలుస్తుంది. కార్పొరేట్‌ బదర్స్‌ గా పేరున్న అనిల్‌ అంబానీ, ముకేశ్‌ అంబానీ ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముకేశ్‌ వ్యాపారంలో రాణిస్తూ ఫోర్బ్స్‌ ధనవంతుల జాబితాలో దూసుకు పోతుండగా, అనిల్‌ అంబానీ అప్పుల ఊబిలో కూరుకపోయి ఫోర్బ్స్‌ ధనవంతుల జాబితాలోంచి ఇటీవల పడిపోయారు. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో సంస్థ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తుల కొనుగోలుకు యోచిస్తోందని కార్పోరేట్ వర్గల్లో టాక్ నడుస్తుంది.

 

ఆర్‌కాం సంస్థ దివాలా తీసిన నేపథ్యంలో ఆయా ఆస్తులను కొనుగోలు చేసేందుకు ముకేశ్‌ అంబానీ బిడ్‌ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఆర్కామ్ కి సంబంధించిన టవర్లు, ఫ్రీక్వెన్సీలను కొనుగోలు చేయాలని భావిస్తోందట. రూ.7,300 కోట్లమేర ఆర్‌కాం ఆస్తుల కొనుగోలు చేయాలని ముకేశ్‌ గతంలో ప్రయత్నించారు, కానీ టెలికాం శాఖ అనుమతి లభించక పోవడంతో ఈ డీల్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ ఏడాది మార్చిలో ఎరిక్సన్ కు కట్టాల్సిన రూ.580 కోట్లు అప్పును ముకేశ్‌ అంబానీ చెల్లించి జైలు ఊచలు లెక్కపెట్టకుండా కాపాడారు. ఇప్పుడు ఈ డీల్ ఎంతవరకు ముందుకు సాగుతుందో చూడాలి.