పంచాయతీ ఎన్నికలు.. 3 రోజులు మందు బంద్ !

తెలంగాణ ఎన్నికలు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మందు ఏరులై పారింది. రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్ముడుపోయింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి లిక్కర్ అమ్మకాలకి రెక్కలొచ్చాయ్. ఐతే, ఆ అమ్మకాలకి ఎలక్షన్ కమిషన్ మూడు రోజుల పాటు బ్రేక్ వేసింది. మొదటి విడత పోలింగ్ నెల 19న సాయంత్రం 5గంటల నుంచి 21న కౌంటింగ్ ముగిసే వరకూ లిక్కర్ షాపులు మూసేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

రెండో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఈ నెల23వ తేదీ నుంచి 25 వరకు మందు షాపులు బంద్ కానున్నాయి. ఇక, మూడో విడత పోలింగ్ కు సంబంధించి ఈ నెల 28 నుంచి 30 వరకూ లిక్కర్ షాపులు మూసివేయనున్నారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.

ఇక పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువైందని సమాచారమ్. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓ వార్డ్ మెంబర్ సుమారు రూ. 3 నుంచి 4లక్షలు ఖర్చు పెడుతున్నారంట. ఇక సర్పంచ్ అభ్యర్థి అయితే ఏకంగా రూ. 20 నుంచి 30 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారమ్.