ఎన్నికలు ముగిసై..పెట్రో బాదుడు షురూ అయ్యింది

పెట్రో బాదుడు మళ్లీ షురూ అయ్యింది..నెల రోజులుగా పెట్రోల్ ధరలు తగ్గుతూ వస్తుండడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేసారు..కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడంతో మళ్లీ పెట్రో బాదుడు మొదలు అయ్యింది.

గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోలు ధరలు గురువారం (డిసెంబరు 13) పెరిగాయి. డీజిల్ ధర మూడో రోజు కూడా స్థిరంగానే ఉంది. హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర 11 పైసలు పెరిగి రూ.74.55 ఉండగా.. డీజిల్ ధర రూ.70.26 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర 10 పైసలు పెరిగి రూ.74.05 ఉండగా.. డీజిల్‌ ధర రూ.69.39 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 9 పైసలు పెరిగి రూ.70.29 కి చేరగా.. డీజిల్ ధర రూ.64.66 వద్దే కొనసాగుతోంది. ఇక ముంబయిలో పెట్రోలు ధర 11 పైసలు పెరిగి రూ.75.91 ఉండగా.. డీజిల్ ధర రూ.67.66 గా ఉంది.