పూణే టెస్ట్: హిట్ మ్యాన్ .. ఫ్లాఫ్ షో


దక్షిణాఫ్రికాతో పూణేలో జరుగుతున్న రెండో టెస్ట్ లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. కాగ ఓపెనర్ గా తొలి టెస్టులో అదరగొట్టిన రోహిత్ రెండో టెస్టు తొలి ఇన్సింగ్స్ లో నిరాశపరిచాడు. ఆట మొదలైన కాసేపటికే పెవిలియన్ చేరాడు.

రబాడా వేసిన 10వ ఓవర్ చివరి బంతిని ఆడిన రోహిత్ (14)..డికాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మయాంక్ గర్వాల్ పుజారా ఉన్నారు. విశాఖలో జరిగిన తొలి టెస్టులో సాధించిన విజయంతో ఉత్సాహంతో ఉన్న భారత జట్టు, ఈ మ్యాచ్ లో గెలిచి, సిరీస్ ను సాధించాలన్న పట్టుదలతో ఉంది.