నేడే సద్దుల బతుకమ్మ..

బతుకమ్మ వేడుక ఆఖరి రోజుకు వచ్చేసింది..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అక్టోబరు 9 నుండి మొదలవ్వగా ఈరోజు (అక్టోబర్ 17) తో ముగియనున్నాయి. మొత్తం తొమ్మిది రోజులపాటు ఈ బతుకమ్మను ఆడవారు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణ సాంస్కృతికకు ప్రతీక ఈ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రంలోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు.

మనిషికి, ప్రకృతితో ఉన్న సంబంధానికి ప్రతీకగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంది. అలాంటి ప్రాస్తశ్యం బతుకమ్మ పండుగకు ఉంది. అందుకే తొమ్మిది రోజులపాటు పూలనే దేవతలుగా ఆరాధిస్తూ ఆడవారు జరుపుకుంటారు. ఇక ఈ తొమ్మిది రోజుల బతుకమ్మకు తొమ్మిది పేర్లతో పిలిచుకుంటారు. ఈరోజు ఆఖరిగా సద్దుల బతుకమ్మ ను జరుపుకుంటారు.

చివరి రోజు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం… ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహించే సద్దుల బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ట్యాంక్‌బండ్ పరసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించారు హైదరాబాద్‌ పోలీసులు… ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌కు అనుమతి లేదని తెలిపారు. మరోవైపు బతుకమ్మ ఉత్సవాలను చూసేందుకు తరలివచ్చేవారికి పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.