టిక్‌టాక్‌ యాప్‌ బ్యాన్‌ ?


టిక్ టాక్ మోస్ట్ పాపులర్ మొబైల్ యాప్. 2018లో అత్యధికంగా ఆండ్రాయిడ్, ఆపిల్ డివైజ్ లలో డౌన్ లోడ్ చేసుకున్నయాప్స్ లో ఇదొకటి. ఇండియాలో పెద్దసంఖ్యలో టిక్ టాక్ యాప్ ను వాడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు టిక్ టాక్ ఫేవరేట్ యాప్ గా మారింది. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. అదే సమయంలోటిక్ టాక్ చాలా సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది.

ఈ నేపథ్యంలో టిక్ టాక్ యాప్ ని నిషేధించాలనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ యాప్ ని బ్యాన్‌ చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. అశ్లీల సంభాషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఈ యాప్‌ ఉన్నదని తమిళనాడు సమాచార సాంకేతికశాఖ మంత్రి మణికంఠన్‌ తెలిపారు. ఈ యాప్‌ను నిషేధించాలని కేంద్రాన్ని కోరుతామని ఆయన చెప్పారు. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రా ప్రభుత్వాలు కూడా టిక్ టాక్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి.