శ్రీకాకుళాన్ని వణికిస్తున్న ‘తితలీ’..

మరోసారి కోస్తా తీరం తుఫాన్ దాటికి వణికిపోతుంది.. శ్రీకాకుళం జిల్లాలో ‘తితలీ’ తుఫాను ఈరోజు ఉదయం 3 :30 నిమిషాలకు తీరం దాటింది. దీని ప్రభావంతో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అలాగే తీరం దాటిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల దాటికి ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే తుపాను ప్రభావంపై ఆర్టీజీఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తిత్లీ బీభత్సంతో ఇవాళ అంబేద్కర్ యూనివర్శిటీలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు అధికారులు… మరోవైపు విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఒకరోజు సెలవు ప్రకటించారు.