ఏపీ హైకోర్టు ని మరోసారి తప్పుపట్టిన విజయసాయి రెడ్డి

రాష్ట్రంలో ఎలాంటి ఘటన జరిగినా తమ ప్రభుత్వం నిష్పాక్షిక ధోరణి అవలంబిస్తోందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారిఉద్ఘాటించారు. తమకు పక్షపాతం లేదని చెప్పేందుకే ఏ కేసునైనా సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల ఏపీ హైకోర్టు తీసుకున్న పలు నిర్ణయాలు పరిధికి మించి తీసుకున్నట్టుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

చట్టంలో అంత స్పష్టంగా చెప్పినప్పుడు న్యాయమూర్తులు ఎలా స్టే ఇస్తారు? కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో స్టే ఇవ్వొచ్చని సుప్రీం కోర్టు చెప్పినా, ఇవాళ అలాంటి పరిస్థితులు ఈ కేసుకు లేవు.  ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోతే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు కదా… స్టే ఇవ్వాల్సిన అవసరం ఏంటి? దీనికి కోర్టే బదులు చెప్పాలి. చట్టం ఎవరికైనా ఒకటే. న్యాయమూర్తులకు ఒక ప్రత్యేక చట్టం ఉండదు, ప్రధానికైనా అంతే” అని స్పష్టం చేశారు.