కరోనా వ్యాక్సిన్ కి డెడ్ లైన్ పెట్టిన ట్రంప్

కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. నవంబర్‌ కన్నా ముందే ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తోందంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరోసారి అభిప్రాయపడ్డారు. వచ్చే మూడు, నాలుగు వారాల్లోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు.

 కాగ  నవంబర్‌ మూడో తేదీన జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ తీసుకురావడం కోసం ఎఫ్‌డీఏ మీద వైట్‌హౌజ్‌ ఒత్తిడి తెస్తోందనే విమర్శలు పెరిగిపోయాయి. ఈ విషయంపై ఇప్పటికే వైట్‌హౌజ్‌ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో శాస్త్రీయంగా నిరూపితమయ్యే వరకూ దీన్ని విడుదల చేయమని ఆస్ట్రాజెనికాతోపాటు వ్యాక్సిన్‌ తయారుచేస్తోన్న తొమ్మిది సంస్థలు ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అమెరికాలో వ్యాక్సిన్‌ విడుదలపై ట్రంప్‌ ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తోంది.