రాజ్యసభలో హైకోర్టు ని ఎండగట్టిన వి.సాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రోజు రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు. న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉందని, ఈ ధోరణి వెంటనే మానుకోవాలని పేర్కొన్నారు.

న్యాయ వ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని సభలో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోందని, మీడియా, సోషల్ మీడియాపై నిషేధం విధించిందని సభలో ప్రస్తావించారు.

మాజీ అడ్వకేట్ జనరల్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రిపోర్టు చేయవద్దని నిషేధం విధించిందని ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. ఈ చర్యలను సమర్ధించుకునే ఏ ఆధారమూ లేదని, ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైందని తెలిపారు. బ్రిటిష్ తరహాలో వ్యవహరిస్తూ.. దీనికి సంబంధించిన మరో కేసు పైన కూడా స్టే విధించారని, గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు.

నిష్పాక్షికతను విస్మరిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ అసాధారణ రీతిలో ప్రభుత్వంపైన, మీడియా, సోషల్ మీడియా, పత్రికా స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్రం పై చేసిన దాడి గురించి రాజ్యసభలో ప్రస్తావించడం జరిగింది.

Video Link: https://t.co/ATu1p9BuZz pic.twitter.com/sDkZTSWa42
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 17, 2020