తెరాసలో కాంగ్రెస్ విలీనం

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి శాసనసభపక్ష హోదా దక్కకుండా టీఆర్ఎస్‌ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 ఎమ్మెల్యేల స్థానాల్లో విజయం సాధించింది. వీరిలో 10 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా మరో ముగ్గురు తెరాసలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడ దక్కని పరిస్థితి కూడ నెలకొంటుంది.

టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని వీలీనం చేస్తున్నట్టుగా స్పీకర్‌కు లేఖ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టుగా లేఖ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.