అమరావతికి గుడ్ బై చెప్పిన సింగపూర్


ఏపీ రాజధాని అమరావతి స్టార్టప్ ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ తప్పుకుంది. ఏపీ ప్రభుత్వం-సింగపూర్ కన్సార్టియం చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు.

‘గతంలో 6.84 కిలో చదరపు కిలో మీటర్లు రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ద్వారా సింగపూర్ కన్సార్టియం 2017లో ఏర్పడింది. ఈ ప్రాజెక్టును రద్దు చేసుకోవడం కొన్ని మిలియన్ డాలర్ల మేర మాత్రమే ప్రభావం చూపుతుందని కన్సార్టియం కంపెనీలు చెపుతున్నాయి. అయితే ఇండియాలో తమ పెట్టుబడులపై దీని ప్రభావం ఏమీ ఉండదని సింగపూర్ కన్సార్టియం కంపెనీలు చెపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలపట్ల సింగపూర్ కంపెనీలు ఇకపై కూడా ఆసక్తి కనబరుస్తాయి. ఇండియా ఓ అద్బుతమైన అవకాశాలు కలిగిన అతిపెద్ద మార్కెట్‌గా నేటికి మేం భావిస్తున్నాం’ అని ప్రకటనలో మంత్రి ఈశ్వరన్ స్పష్టం చేశారు.