ఆదినారాయరెడ్డి ఎన్ కౌంటర్ కు పిలుపు..

వివేకానంద రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో వివేకా ను అతి దారుణంగా చంపడం అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హత్య ఫై సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే తెలుగు దేశం నేతలతో పాటు మరికొంతమందిని విచారించగా..తాజాగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.

ఈ కేసుకు సంబంధించి అంశాలపై సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు విజయవాడలో ఉన్నానని.. వివేకా హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఆదినారాయణ తెలిపారు. ఈ కేసులో తన ప్రమేయం ఉంటే ఎన్‌కౌంటర్ చేసుకోవచ్చని.. సీబీఐ విచారణ కావాలన్నదే తమ డిమాండ్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి గతవారం సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డ్రైవర్ దస్తగిరి, ప్రకాష్‌లను ప్రశ్నించారు. ఇద్దరి నుంచి వివరాలు సేకరించారు. మరికొందరు అనుమానితులు, సాక్ష్యుల్ని కూడా విచారణకు పిలుస్తున్నారు.