జనసేన లోకి పవన్ ప్రాణ స్నేహితుడు..?

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కి ప్రజల్లో మంచి ఆదరణ కనపరుస్తుంది..సీనియర్ రాజకీయ నాయకులు ఒక్కరుగా పార్టీ తీర్థం పుచ్చుకుంటూ జనసేనకు బలం ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగుదేశం , వైస్సార్సీపీ నాయకులు జనసేనలో చేరగా , తాజాగా పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు సైతం జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ నటించిన చాల సినిమాల్లో నటించి పవన్ కు ప్రాణ స్నేహితుడైన ఆలీ..త్వరలో జనసేన పార్టీ లోకి చేరబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా జనసేన వెనుకాల ఉంటూ పార్టీ కి సంబందించిన వ్యవహారాలు అలీ చేసుకుంటున్నట్లు వినికిడి. అంతే కాదు సెప్టెంబర్ 23 న పవన్ కళ్యాణ్ నెల్లూరుజిల్లా బారా షహీద్ దర్గా వద్ద ప్రార్థనలు చేసి, రొట్టెలు విడవడానికి వస్తున్నారు. ఆయన వెంబడి ఆలీ కూడా అక్కడకు వెళ్తుండడం.. ఆయనతో పాటు పాల్గొనడం ఇవన్నీ చూస్తుంటే ఆలీ జనసేనలో చేరడం నిజమే అనిపిస్తుంది.

వాస్తవానికి అలీ కి చాల రోజులుగా రాజకీయాల్లో చేరాలనే ఆత్రుత ఉంది. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికలబరిలోకి వస్తారనే ప్రచారం కూడా విస్తృతంగానే జరిగింది. 2014 ఎన్నికల సమయంలోనే ఆలీ, తెలుగుదేశం పార్టీ తరఫున.. రాజమండ్రి నుంచి గానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గానీ ఎన్నికల్లో పోటీచేస్తారని పుకార్లు వచ్చాయి. ఆ సందర్భంలోనే.. ఓసారి ఆలీ మీడియాతో మాట్లాడుతూ.. సినీరంగంలో తనకు బాగా మిత్రుడైన పవన్ కల్యాణ్ పార్టీ పెడితే తాను కూడా అందులో చేరుతానని ప్రకటించారు.

ఇప్పుడు ఆ మాటలు నిజం చేయబోతున్నాడని అంత అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది చూడాలి.