ఏపీలో కొత్త జిల్లాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రకటన రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ క్యాబినెట్ మూడు కొత్త జిల్లాలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించాడని సమాచారం.

దీని పై ప్రభుత్వ వర్గాల నుండి అయితే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐతే జిల్లాల ఏర్పాటు జరగబోతోందని మాత్రం పక్కాగా తెలుస్తుంది. ఈ మూడు ప్రాంతాల్లో వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలంటే రూ.500- రూ.600 కోట్ల వరకూ వ్యయమవుతుంది. అక్షరాస్యత, వైద్య వసతులు తక్కువగా ఉండి, అసలు ఎలాంటి వైద్య కళాశాలలు లేని బాగా వెనుకబడి ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తే… అందుకయ్యే వ్యయంలో 60శాతం వరకూ భారత వైద్య మండలి సమకూర్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే తొలి దశలో పైన పేర్కొన్న 3 ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.