చంద్రబాబు డిసైడ్ అయ్యాడా..? అందుకే ఇలా మాట్లాడుతున్నాడా..?

ఈసారి సీఎం కావడం కష్టమే..ముఖ్యమంత్రి పదవి ఈ నాల్గు రోజులే..ప్రస్తుతం చంద్రబాబు మనసులోని మాటలు..పోలింగ్ శాతం..మీడియా చానెల్స్ లెక్కలు..రాజకీయ విశ్లేషకుల మాట తీరు ఇవన్నీ చూస్తే జగన్ సీఎం కాబోతున్నాడని బలంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రినని, 2014లో జూన్ 8న ప్రమాణస్వీకారం చేశాను కాబట్టి, 2019లో కూడా అదే రోజు వరకు తాను సీఎంగా ఉంటానని ప్రకటించారు.

ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎనిమిది వారాల సమయం ఇస్తారని చెప్పారు. అంటే పరోక్షంగా తనకు కూడా ఎన్నిల ఫలితాలు వచ్చిన తర్వాత కొంత సమయం ఇవ్వాలనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ నాయకులు అంటున్నారు. ఏపీ లో మే 23న ఫలితాలు రానున్నాయి. మెజారిటీ వచ్చిన పార్టీ గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరుతుంది. ఒకవేళ బాబు మళ్లీ వస్తే ఒకే..లేదంటే జగన్ సీఎం అవుతారు. ఈ నేపథ్యంలో బాబు జూన్ 8 వరకు వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం ద్వారా.. ఓటమి తప్పదనే అంచనాకు వచ్చి ఉంటారనే చర్చ జరుగుతోంది. అందుకే జూన్ 8 వరకు తానే సీఎంగా ఉంటానని చెబుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.