కమలం – జనసేన పొత్తు

ముందు నుండి అనుకున్నట్లే జనసేన కమలం కలిసిపోయింది. గత కొన్ని రోజులుగా పవన్ హస్తిన చుట్టూ తిరిగి కమలం తో పొత్తు కు ఒకే చేయించుకున్నాడు. బేషరుతుగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నాం అని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ భవిష్యతో కోసమే బీజేపీతో ఈ పొత్తు అని చెప్పి తెరదించారు.

జనసేన-బీజేపీతో పొత్తుపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సినీ నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత. తొలి నుండి పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానం ఉన్న మాధవీలత.. జనసేన-బీజేపీ పొత్తును స్వాగతిస్తూ ఆమె ఫేస్ బుక్‌లో ఆనందం వ్యక్తం చేశారు.

జనసేన, బీజేపీ పొత్తు పట్ల వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఏడు నెలల కాలంలో జగన్ సర్కారు విఫలం ప్రభుత్వం విఫలమైందనడం సరికాదన్న అంబటి.. కులతత్వాన్ని, అవినీతి, కుటుంబ పాలనను టీడీపీకే కూడా తమ ప్రభుత్వం మీద రుద్దడానికి బీజేపీ-జనసేన ప్రయత్నించడం సరికాదన్నారు. బీజేపీపై పెద్దగా విమర్శలు గుప్పించని ఆయన.. పవన్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు.