జగన్ కు షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం..

రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలుపొందాలనే దిశగా పరుగులు పెడుతున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్‌ను సస్పెండ్ చేసిన కేసులో మార్చి 11వ తేదీలోపు విచారణకు హాజరు కావాలంటూ జగన్ కు నోటీసు ఇచ్చింది.

2009లో శివకుమార్ వైసీపీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీని జగన్‌కు అప్పగించారు. అప్పటి నుంచి జగన్ అధ్యక్షుడిగా, విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇక శివకుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శివకుమార్ టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన వైసీపీ పార్టీ పెద్దలు.. శివకుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.

ఈ కారణమైన లేక మరోటి ఉందా అనేది తెలుసుకోవాలని శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. వ్యవస్థాపక అధ్యక్షుడినైన తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదంటూ సీఈసీకి ఫిర్యాదు చేసాడు. శివకుమార్ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం జగన్‌కు నోటీసులు జారీచేసింది.