ఇంగ్లిష్ మీడియం ఎడ్యుకేషన్ ఫై జగన్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్ లలో ఇంగ్లిష్ మీడియం ఎడ్యుకేషన్ పెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఫై విపక్షాలు విమర్శలు చేసిన..చాలామంది మాత్రం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నాడని అన్నారు. కానీ ఇప్పడు హైకోర్టు మాత్రం ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.

తమకు ఇష్టమైన మాధ్యమంలో చదువుకునే హక్కు విద్యార్థులకు ఉందని న్యాయస్థానం తెలిపింది. ఇంగ్లిష్ మీడియంలో నిర్బంధ బోధన కుదరదని స్పష్టం చేసింది. సర్కారీ బడుల్లో తెలుగు మీడియాన్ని తొలగించి పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే బోధన చేయడం సరికాదంటూ.. శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలని విద్యార్థులను నిర్బంధించలేమని తేల్చి చెప్పింది. అలా చేయడం సుప్రీం ఆదేశాలకు విరుద్ధమని తెలిపింది. మైరి కోర్ట్ తీర్పు ఫై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.