జనసేన ప్రచారంలో మరో స్టార్..

జనసేన ప్రచారం మొత్తం కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే మోస్తున్నారు..ఇప్పుడు ఆ ప్రచారంలో మరో స్టార్ ఎంట్రీ అయ్యాడు. జబర్దస్త్ అంటే హైపర్ ఆది..హైపర్ ఆది అంటే జబర్దస్త్ అనేంతగా పేరు తెచ్చుకున్న ఆది..జనసేన ప్రచారం మొదలు పెట్టారు. మొదటి నుండి జనసేన కు మద్దతు ఇస్తున్న ఆది..తాజాగా జనసేన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం ప్రారంభించారు.

శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తరపున ప్రచారం చేశారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపొరలో జనసైనికులతో కలిసి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ విజయ కేతనం ఎగరవేగడం ఖాయమన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మనోహర్‌‌కే దక్కుతుందున్నారు. జనసేనకు ఓటు వేసి.. తెనాలిలో నాదెండ్లను గెలిపించాలని.. పవన్‌ కళ్యా‌ణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఆది ని చూసేందుకు జనాలు పోటీ పడ్డారు.