జనసేన డెడ్ లైన్ ప్రకటించింది..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని రాజకీయ పార్టీల తరహాలో కాకుండా సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. డబ్బు , హోదా ఉన్న వారికీ రాజకీయ టికెట్ కాకుండా ప్రజల కష్టాలు తెలుసుకొని , వారి కష్టాలను తీర్చగల అభ్యర్థులకు జనసేన టికెట్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే టికెట్ల విషయంలో అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను తీసుకుంటున్న జనసేన పార్టీ.. అందుకు సంబంధించి డెడ్ లైన్ ప్రకటించింది. ఫిబ్రవరి 25 లోగా పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వాళ్లంతా దరఖాస్తులు చేసుకోవాలని.. ఆ తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవని ప్రకటించింది. అన్ని లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకూ జనసేన దరఖాస్తులను తీసుకుంటోంది.

ఇప్పటివరకూ అన్నీ కలిపి పదిహేనువందల అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది. మరో నాల్గు రోజుల్లో ఇంకో రెండు వేల వరకూ అప్లికేషన్లు రావొచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఇతర పార్టీలలో వలసలు మొదలు అవ్వగా , జనసేన లో మాత్రం ఆ హడావిడి కనిపించడం లో టీడీపీ, వైసీపీ పార్టీలలో టికెట్స్ రాని పక్షంలో జనసేన లో చేరాలని కొంతమంది నేతలు భావిస్తున్నారు. మరి వారికీ టికెట్స్ ఇస్తారా..లేక దరఖాస్తులు చేసుకున్న వారికీ ఇస్తారా అనేది చూడాలి.