గుంటూరు నుండి నాగార్జున పోటీ..?

కింగ్ నాగార్జున కు సంబందించిన ఓ వార్త ఈరోజు తెగ హల్చల్ చేస్తుంది. నిన్న జగన్ ను నాగార్జున కలవడం తో ఆయన వైస్సార్సీపీ పార్టీ లోకి చేరుతున్నారనే వార్త ఊపందుకుంది.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం నాగార్జున నిజం గా చేరతాడేమో అని కాస్త ఖంగారు పడి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. ఇలా రెండు జరగడం తో పుకారు రాయళ్లు ఇంకాస్త జోరు పెంచారు..నాగ్ కలవడం , చంద్రబాబు స్టేట్మెంట్స్ ఇవ్వడం తో నాగ్ కు టికెట్ అంటకట్టారు.

నాగార్జున గుంటూరు టికెట్ అడుగుతున్నాడని , వైస్సార్సీపీ నుండి బరిలోకి దిగబోతున్నాడని , అందుకే జగన్ ను కలిసి గుంటూరు బరి గురించి అడిగాడని ఇలా రకరకాల వార్తలు పుట్టించారు. ఈ వార్తల్లో నూటికి తొంభైశాతం నిజం లేదు. ఎందుకంటే నాగార్జున ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతారని అనుకోవడానికి వీలు లేదు. నాగ్ ఎప్పుడు కూడా వివాదాస్పద జోలికి వెళ్ళాడు. ముఖ్యం గా రాజకీయ పార్టీ లతో చాల జాగ్రత్తగా ఉంటాడు. నాగార్జున కు ప్రతి ఒక్కరి సాయం కావాలి. అది ఏ రకంగానైనా సరే..అందుకే అందరితో అణిగిమణిగి ఉంటాడు తప్ప పూర్తిగా రాజకీయా జోలికి వెళ్ళాడు. ఇప్పటికే ఆయన రాజకీయాల ఫై ఓ క్లారిటీ కూడా ఇచ్చాడు. సో నాగ్ గుంటూరు నుండి పోటీ అనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.