టీడీపీకి షాక్…జనసేన లో చేరిన టీడీపీ నేత..

జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో బలం పెంచుకుంటుంది..పవన్ ప్రజా పోరాట యాత్ర పేరుతో ప్రజల హృదయాలనే కాదు రాజకీయ నాయకుల హృదయాలను సైతం ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ యాత్ర లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ టీడీపీ ఫై ఓ రేంజ్ లో మండిపడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యం లో ముందు ముందు జనసేన పార్టీ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు , నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పలువురు పవన్ వెంట అడుగులు వెయ్యాలని నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ లో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు , యువత జనసేన తీర్థం పుచ్చుకోగా , తాజాగా కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా నవీన్‌ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.

తాజాగా మీడియా సమావేశం ఏర్పటు చేసిన ఆయన తన భవిష్యత్‌ రాజకీయ వివరాలను తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలగేందుకు గల కారణాలను వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని , కాపులకు రిజర్వేషన్‌ హామీని నెరవేర్చలేకపోవడం ఎంతో బాధేసిందని తెలిపాడు. అవినీతి లేని రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలిపాడు. ఇటీవల తమ సొంతూరులో సమీక్ష నిర్వహించినప్పుడు వైఎ్‌సఆర్‌,జనసేన పార్టీల నుంచి నాయకులు వచ్చి కలిశారు. అయితే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తనను ఆహ్వానించడంతో ఆ పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు.