ఎన్నికల్లో జనసేన హావ లేనట్లేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో జనసేన హావ పెద్దగా ఉండదా..? పవన్ కళ్యాణ్ ను చూసేందుకే కానీ ఓటుసే జనాలు లేరా..? జనసేన అంటే పవన్ పార్టీ తప్ప ప్రజల పార్టీ ని నమ్మకం కలగడం లేదా..? ప్రజలు , నేతలు జనసేనను పెద్దగా పట్టించుకోవడం లేదా..? రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం VS వైస్సార్సీపీ మధ్యనే పోటీనా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

మొన్నటివరకు జనసేన అంటే కాస్తోకూస్తో ప్రజల్లో , నేతల్లో ఆసక్తి ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే జనసేన ను లెక్కలోకి తీసుకోవడం లేదని స్పష్టం గా అర్ధం అవుతుంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీల్లో ఎన్నికల జోరు మొదలు అయ్యింది. కానీ జనసేన పార్టీ లో మాత్రం ఇంకా ఆ ఊసే ఎత్తడం లేదు. పవన్ పర్యటిస్తున్నాడు కానీ నేతలు మాత్రం ఆ పార్టీ లోకి వెచ్చేందుకు పయనం కావడం లేదు. సీనియర్ నేతలతో పాటు తెలుగుదేశం , వైసీపీ , బీజీపీ పార్టీ లనుండి కూడా చాలామంది నేతలే జనసేన లో చేరుతారనే వార్తలు నెల కింద వరకు ప్రచారం జరిగాయి.. కానీ ప్రస్తుతం మాత్రం నేతలంతా వైసీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి కీలక నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకోగా , మరికొంతమంది ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తుంది. జనసేన విషయానికి వస్తే కేవలం ఇద్దరు , ముగ్గురు మాత్రమే తప్ప ఎవరు చేరలేదు. పవన్ సైతం కొత్తవారికి అవకాశం ఇస్తుండడం తో కొత్త పార్టీ కొత్తవారితో ఎలా సాగుతుందో అనే అనుమానం ప్రజల్లో కూడా కలుగుతుంది. మరి ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.