ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడో తెలుసా..?

నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ..ఇప్పుడు దారుణమైన పరిస్థితి చేరుకుంది. ఇప్పటివరకు ఎన్నడూ లేని అపకీర్తి ని ఇప్పుడు పొందింది. దీనికి కారణం ఏంటి అనేది ప్రజలకు తెలుసు. అందుకే వారి తీర్పు ద్వారా చెప్పు దెబ్బ కొట్టినట్లు చేసారు. 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 23 స్థానాలు దక్కించుకుందంటే పార్టీ పరువు ను.. అన్న గారి ఆశయాలను ఎంత దెబ్బ తీశారో అర్ధం అవుతుంది. ఈ రిజల్ట్ తో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అంత మాట్లాడుకుంటున్నారు. అదే విధంగా మళ్లీ పార్టీ కి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే..పార్టీ పగ్గాలు పడితేనే వస్తుందని తేల్చి చెపుతున్నారు.

ఇదే విషయమై వైసీపీ నేత కొడాలి నాని స్పందించారు. గుడివాడ నియోజక వర్గం నుంచి వైకాపా తరపున గెలుపొందిన నాని.. మీడియాతో మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని, 2024 వరకు తెలుగుదేశం పార్టీ కనుమరుగౌతుందని చెపుతూనే ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎన్టీఆర్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని.. అయితే ఇప్పుడు కాదని, 2024 తరువాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ఈయన మాటలను నమ్మొచ్చని అంత అంటున్నారు..ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కు నాని బాగా సన్నిహితుడు కావడమే. మరి నిజంగా ఎన్టీఆర్ 2024 వస్తాడో చూద్దాం.