ఇక మెగాస్టార్ రాజకీయాల్లోకి రారు – పవన్ కళ్యాణ్

చిత్ర సీమలో మెగాస్టార్ గా రాణించిన చిరంజీవి , రాజకీయాల్లో మాత్రం స్టార్ కాలేకపోయారు. 2008 లో ప్రజారాజ్యం అంటూ పార్టీ స్థాపించి , సినిమాలకు దూరమై ప్రజల్లోకి ప్రజా రాజ్యం పార్టీ తో ముందుకు వెళ్లారు. కానీ ఆ తర్వాత సొంత పార్టీని నడిపించడం లో విఫలం అయి , 2011 లో కాంగ్రెస్ పార్టీ లో కలిపేశారు. ఆ తర్వాత రాజకీయాలకు కాస్త అటు ఇటు గా ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల తర్వాత పూర్తిగా రాజకీయాల కు దూరమై , మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు.

ఈ నేపథ్యం లో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల ఫై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. మా అన్నయ్య చిరంజీవిగారు కూడా సునామీలా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అన్నయ్యకు లేదు. ఆయన తన జీవితాన్ని సినిమాలకే అంకితం చేశారు’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ తెలిపిన దాని బట్టి చూస్తే చిరు ఇక రాజకీయాల దూరం ఉంటారని , సినిమాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఇక పవన్ విషయానికి వస్తే జనసేన అంటూ ప్రజల్లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రజా పోరాట యాత్ర పేరుతో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి.