పెథాయ్‌ ఎఫెక్ట్ తో రద్దైన రైళ్లు ఇవే..

పెథాయ్‌ తుపాను మరికొన్ని గంటల్లో తీరం దాటడం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ప్రజలను అలర్ట్ చేసారు. ముఖ్యం గా తీరం వెంబడి ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కల్లోలాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి యంత్రాంగం సన్నద్ధమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ), ఆర్టీజీల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తక్షణ చర్యలకు ఉపక్రమిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో నెలకొన్న పరిస్థితి, చేపట్టిన సహాయక చర్యలను జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాకు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. మరోపక్క తుఫాన్‌ నేపథ్యంలో ఏపీలో రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రద్దైన రైళ్లు ఇవే..

* ట్రైన్‌ నెం. 67300, విజయవాడ-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 67295, రాజమండ్రి-విశాఖపట్నం, మెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 67244, విశాఖపట్నం-కాకినాడ పోర్టు, మెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 67242, కాకినాడ పోర్టు-విజయవాడ, మెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 67221, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌

* ట్రైన్‌ నెం. 12805 జన్మభూమి
* ట్రైన్‌ నెం. 17240 సింహాద్రి ఎక్స్‌ప్రెస్
* ట్రైన్‌ నెం. 12717 రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌

* ట్రైన్‌ నెం. 67222, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 67225, గుంటూరు-తెనాలి, మెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 67226, తెనాలి-విజయవాడ, మెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 67227, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 67228, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 67296, విశాఖపట్నం-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 67241, విజయవాడ-కాకినాడ పోర్ట్‌, మెము ప్యాసింజర్‌

* ట్రైన్‌ నెం. 77206, భీమవరం-విజయవాడ, డెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 77294, రాజమండ్రి-నర్సాపూర్‌, డెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 77295, నర్సాపూర్‌-గుంటూరు, డెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 77230, గుంటూరు-విజయవాడ, డెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 77269, విజయవాడ-మచిలీపట్నం, డెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 77242, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 77237, భీమవరం-రాజమండ్రి, డెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 77238, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 77231, భీమవరం-నిడదవోలు, డెము ప్యాసింజర్‌
* ట్రైన్‌ నెం. 77240, నిడదవోలు-భీమవరం, డెము ప్యాసింజర్‌