జనసేన కు ఉన్న ఒక్కరు కూడా పోయినట్లే ..

ఏపీ శాసన ఎన్నికల్లో కేవలం ఒకే ఒకటి స్థానం తో జనసేన పార్టీ సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఒక్క స్థానం కూడా లేకుండాపోతుంది తెలుస్తుంది. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు త్వరలోనే పార్టీ మారబోతారనే సంకేతాలు ఆయన మాటల్లోనే తెలుస్తుంది. గత కొద్దీ రోజులుగా పేరుకు జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ..వైసీపీ ప్రభుత్వానికి , జగన్ కు మద్దతు ఇస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లోను జగన్ నిర్ణయాలకు మద్దతు తెలిపాడు.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫై సంచలన కామెంట్స్ చేయడం తో రాపాక పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జనసేన పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదని.. నెలకోకసారి పవన్‌ కళ్యాణ్‌ ప్రజల్లోకి వస్తానంటే పార్టీకి భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓ ఎమ్మెల్యేగా తన భవిష్యత్తును తాను చేసుకోవాలి కదా అని వ్యాఖ్యానించిన ఆయన.. ఈ రోజుల్లో పార్టీ మారడం సర్వసాధారణం. పార్టీ మారాలన్న ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు. దీని బట్టి చూస్తే త్వరలోనే ఆయన పార్టీ మారడం ఖాయంగా అర్ధమవుతుంది.