తీరం తాకిన ‘పెథాయ్‌’ తూఫాన్

‘పెథాయ్‌’ తూఫాన్ తీరం తాకింది..అమలాపురానికి 20 కి.మీ ల దూరం లో దాటినా తూఫాన్. ఇక.. తీరం వెంబడి గంటకు 80-100కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం తాకడం తో సముద్రంలో అలలు ఎగిసిపడి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు.. కాకినాడలో 7వ నెంబరు.. గంగవరం, విశాఖ పోర్టుల్లో 6వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

తీర ప్రాంతాల్లో ఈదురు గాలులు విపరీతంగా వీస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం తో ప్రజలు భయం తో వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులు, భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, పాతఇళ్లు కూలిపోతున్నాయి.