వైసీపీ వలసలకు బ్రేక్..

గత పది రోజులుగా వైస్సార్సీపీ పార్టీ లోకి ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రులు , మ్మెల్యే లు అలాగే తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ఇలా చాలామందే వైసీపీ కండువా కప్పుకుంటూ వచ్చారు. ప్రతి రోజు ఎవరో ఒకరు చేరడం తో వార్తల్లో హైలైట్ గా నిలిచేది. అలాగే అధికార పార్టీ సైతం ఈ వలసలు చూసి కాస్త ఖంగారు పడాల్సి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వలసలకు చెక్ పడింది. కాకపోతే పూర్తి గా కాదు కేవలం వారం రోజులు మాత్రమే.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిన్న రాత్రి లండన్ బయల్దేరి వెళ్లారు. సతీసమేతంగా ఆయన అక్కడున్న కూతురును చూడటానికి వెళ్లడం జరిగింది. వారంరోజుల పాటు జగన్ అక్కడే ఉంటారు. మళ్లీ ఫిబ్రవరి 26 న హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్నారు. జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ వలసలు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. ఈసారి ఎవరు ఊహించని వారు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతారని నేతలు చెప్పడం తో వారెవరా అనే ఆసక్తి ఇటు తెలుగుదేశం , జనసేన నేతలతో పాటు జగన్ వర్గీయుల్లో ఉంది. మరి వారు సినిమా స్టార్సా..లేక టీడీపీ నేతల..ఇంకా మరెవరా..అనేది చూడాలి.