జగనన్న కు రాఖీలు కట్టారు..

ఆంధ్రప్రదేశ్ లో రాఖీ పండగా వచ్చింది..మహిళల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న చరిత్రాత్మక బిల్లుఫై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠిన శిక్ష విధించేలా ముసాయిదా బిల్లును తీసుకరావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్‌లో వైఎస్‌ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా.. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.