జైట్లీకి మళ్లీ అనారోగ్యం


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ మరోసారి అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. జైట్లీ కొంతకాలంగా తొడలో సాఫ్ట్‌ టిష్యూ కాన్సర్‌ తో బాధపడుతున్నారు. గత యేడాది ఆయన మూత‍్ర పిండ మార్పడి ఆపరేషన్‌ కూడా చేయించుకొన్నారు. తాజాగా మరోసారి జైట్లీ అనారోగ్యానికి గురికావడంతో.. చికిత్స కోసం న్యూయార్క్‌కు బయలుదేరి వెళ్లారు. అమెరికాలో జైట్లీకి శస్త్రచికిత్స నిర‍్వహించన్నారు. ఆపరేషన్‌తోపాటు కీమోథెరపీ చికిత్సల అనంతరం ఇంత స్వల్పకాలంలో రాజధానికి తిరిగి వచ్చే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారమ్.

మరోవైపు, ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్‌పై అవగాహన కల్పించేందుకు ఆర్థికమంత్రిత్వ శాఖ సిద్దమైంది. ట్విటర్‌ ద్వారా ‘నో యువర్‌ బడ్జెట్‌ 2019’ పేరుతో వివిధ అంశాలపై పోస్ట్‌లను ట్వీట్‌ చేస్తోంది. రెవెన్యూ, క్యాపిటల్‌ బడ్జెట్, ఔట్‌ కంబడ్జెట్‌ తదితర అంశాలను సంక్షిప్తంగా వివరిస్తోంది.
జైట్లీకి అనారోగ్యం నేపథ్యంలో.. బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడతారు అనేదానిపై స్పష్టత లేదు.