బండ్ల ట్వీట్ చేశాడండో..

తెలంగాణలో ఓట్ల లెక్కింపు ‌ ముగిసింది. మొత్తం 88 స్థానాలో విజయఢంకా మోగించి రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది టీఆర్ఎస్ . ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌ 19, టీడీపీ 2, భాజపా 1, ఎంఐఎం 7, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు.

ఈ విజయంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సినీనిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని , ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తోందని , ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఐతే గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రాకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటానని బండ్ల గణేశ్ ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఫలితాల అనంతరం మీడియా మిత్రులు బ్లేడులు, కత్తులు తీసుకురావాలని కోరారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు బండ్ల గణేశ్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు.