ఇలాంటి బ్యాటింగ్ ని బాబు భరించగలడా ?


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. రేపు అమరావతికి వెళ్లనున్నారు. తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ పెడతారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లగానే పార్టీ సంక్షోభంలో పడింది. మరికొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పెయడానికి రెడీగా వున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి వ్యూహాత్మక అడుగులు వేస్తారన్న విషయమై చర్చనడుస్తుంది.

చంద్రబాబు ముందు ఇప్పుడు చాలా పెద్ద సవాళ్ళు వున్నాయి. జనాల్లో చంద్రబాబుపై సింపతీ చచ్చిపోయింది. అధికారం వున్నప్పుడు అడ్డగోలుగా నాయకులని లాకున్నారు చంద్రబాబు. ఇప్పుడు టీడీపీ నుండి ఎంత మంది వెళ్ళిపోయినా జనాల్లో చలనం వుండదు. పైగా ఆయన వికెట్లు కాపాడుకోవడం చాలా కష్టం. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి బ్యాటింగ్, తెలంగాణ లో కేసీఆర్ బ్యాటింగ్, కేంద్రంలో మోడీ బ్యాటింగ్ .. ఇంతమంది స్టార్ బ్యాట్స్ మెన్స్ ముందు చంద్రబాబు నిలబడటం అంటే.. మామూలు మాటలు కాదు. మరి చంద్రబాబు ఎలా నెట్టుకోస్తారో చూడాలి.