ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్ : సోనియా-మాయవతి భేటీ క్యాన్సిల్

కేంద్రంలో మోడీని గద్దెదించేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమికి ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఐతే, ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్ మహాకూటమి ప్రయత్నాలకి గండికొట్టినట్టు కనబడుతోంది. మహాకూటమికి బీఎస్పీ దూరంగా ఉంటూ వస్తోంది. మాయవతి కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో బీఎస్పీని ప్రతిపక్షాల కూటమిలోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యవర్తి పాత్ర పోషించారు. అటు రాహుల్‌, ఇటు మాయావతితో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి సోమవారం మాయావతి, సోనియాగాంధీ భేటీ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే, శుక్రవారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ తో సీన్ రివర్స్ అయింది.

మాయావతి సన్నిహితుడు సతీశ్‌ చంద్ర మిశ్రా సోనియా-మాయవతి భేటీపై స్పందించారు. మాయావతికి సోమవారం ఢిల్లీలో ఎలాంటి కార్యక్రమాలు, సమావేశాలు లేవు. ఆమె నేడు లఖ్‌నవూలో ఉంటారని మిశ్రా తెలిపారు. యూపీఏ 120 నుంచి 130 స్థానాలకే పరిమితం కాబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో మాయమతి ఇక చర్చలు అనవసరమని భావిస్తున్నట్టు సమాచారమ్.