వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు..?

విశాఖపట్నం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు మంచి రాజకీయనాయకుడు. కాపు సామాజికవర్గంపై ఈయనకు మంచి పట్టు ఉంది. అందుకే ఇతను ఇప్పటివరకు మూడు పార్టీలు మారిన కానీ ఆ పార్టీ లలో ఉన్నత పదవులు వారిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన తెలుగుదేశం పార్టీ లో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గా కనసాగుతున్నాడు. అయితే ఈయన త్వరలో పార్టీ మారబోతున్నట్లు వార్తలు వినిపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.

తెలుగు దేశం పార్టీ కి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే గతకొద్ది రోజులుగా టీడీపీ పార్టీకి గంటా శ్రీనివాసరావు దూరంగా ఉంటున్నాడని , నిన్న (మంగళవారం) కేబినెట్‌ భేటీకి కూడా డుమ్మా కొట్టారని ప్రచారం జరుగుతుంది. రేపు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండగా… ఆ ఏర్పాట్లను కూడా పట్టించుకోవడం లేదని , ఉదయం నుంచి మంత్రి ఇంటికే పరిమితం అయ్యాడని ప్రచారం జరుగుతుంది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఫై అసంతృప్తి గా ఉండడమే కారణమని కొంతమంది అంటున్నారు.

మరోపక్క గంటా వైసీపీలోకి వస్తుందనేది ఇంతవరకు నాకు తెలియదని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పడం కొస మెరుపు. పార్టీ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే ఆహ్వానిస్తామని , ఎవరొచ్చినా వారి పదవులకు రాజీనామా చేయాలన్నారు. మరి గంటా సైకిల్ దిగి , ఫ్యాన్ పట్టుకుంటాడా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.