జైపాల్ రెడ్డి లక్ష్యం ఏంటో హరీష్ చెప్పేశాడు !

కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి చాన్నాళ్ల తర్వాత సోమవారం మీడియా ముందుకొచ్చాడు. టీఆర్ఎస్ అవినీతి గురించి చాలానే మాట్లాడాడు. అందులోనూ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ శాఖపై ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోనూ 6శాతం కమీషన్ సీఎం కేసీఆర్ కు అందుతున్నాయ్. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆరోపించాయి. ఇప్పుడీ ఆరోపణలపై మంత్రి హారీష్ రావు స్పందించారు.

తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీష్ మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న జైపాల్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి లేదా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు, వార్తా కథనాల్లోకి ఎక్కేందుకే జైపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని హరీశ్ విమర్శించారు.ఇదీ నిజమేనేమో.. !