అమరావతిని పక్కన పెట్టేసిన జగన్

మాజీ సిఏం చంద్రబాబు ప్రధాన అజెండా రాజధాని అమరావతి నిర్మాణం. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఐదేళ్ళు పాటు అదే పాటగా తిరిగారు. అయితే ప్రజలు పట్టించుకోలేదు. ఎన్నికల్లో ఓడించారు. దీంతో అమరావతి ఓ భ్రమరావతి అని ప్రజలే తీర్పు ఇచ్చినట్లయింది. అయితే ఇప్పుడు సిఏం జగన్ ఈ విషయంలో జాగ్రతపడ్డారు. ఆయన అమరావతి పాట పాడటం లేదు. సరిగ్గా చెప్పాలంటే.. అమరావతిని వదిలేశారు.

అమరావతి నిర్మాణం నుండి ప్రపంచ బ్యాంకు తప్పుకుంది. ఏషియన్ బ్యాంకు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విషయంలో బోలెడు చర్చలు జరిగిపోతున్నాయి. అయితే జగన్ మాత్రం వీటిని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ద్రుష్టి సంక్షేమ పధకాలపైనే వుంది. డబ్బులు ఎలా తేవాలి,? ఎలా పంచాలి? ఇంకా ఎలాంటి స్కీములు పెట్టాలనేది జగన్ సర్కార్ ప్రధాన ఎజెండా గా కనిపిస్తుంది. అందుకే అమరావతి నిర్మాణం నుండి ఎవరు తప్పుకున్నా.. జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదనే సంగతి స్పటం అవుతుంది.