ఎలర్ట్: జగన్ ని ముంచేయబోతున్న మీడియా

మీడియా కొట్టే దెబ్బలు తేనే పూసిన కత్తిలా వుంటాయి. తేనే కదా అని నాకితే నాలుకు కోసుకుటుంటుంది. ఇప్పుడు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పై కూడా ఇలాంటి తేనే కత్తి ప్రయోగాలే జరుగుతున్నాయి. జగన్ సిఎం అయినప్పటినుండి భజన మొదలుపెట్టింది మీడియా. ఇందులో ఎల్లో మీడియా కూడా వుంది.

అయితే ఈ భజన కాస్త వేరే లెవల్ కి వెళుతుంది. జగన్ కి పరోక్షంగా కీడు చేసే స్థాయిలో వుంది. ఎలా అంటే.. తాజాగా అన్ని మీడియాల్లో వచ్చిన ఓ కధనం.. జగన్ మోహన్ రెడ్డి.. అధికారులకు చాలా ఫ్రెండ్లీగా వుంటున్నారట. అంతేకాదు… వాళ్ళ అవసరాలని నిమిషాల్లో తేలుస్తున్నారట. అక్కడితో ఆగలేదు.. అంతకుముందు చంద్రబాబు మీటింగ్ పెడితే గంటలు కొద్ది చర్చలు జరిపేవారట. కానీ జగన్ మాత్రం.. గంటలో మీటింగ్ తెల్చేసేసి అధికారులని సమయానికి ఇంటికి పంపించేస్తున్నారట. దీంతో టీవీలో ఇష్టమైన సీరియస్ చూస్తూ హాయిగా ఇంట్లో చేసిన పకోడిలు గట్రా తిని ఎంచక్కా పర్శనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారట అధికారులు. దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డి స్పీడేనని ఓ స్టొరీ వండారు

జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ ‘స్పీడు” అని సంతోషపడితే ఇంకంతే సంగతులు. ఇలాంటి భజనా కార్యక్రమాలు జగన్ కి మేలు చేయవు. జగన్ తో మీటింగ్ లు జరిపే అధికారులు అంటే ఐఎఎస్, ఐపీఎస్, గ్రూప్ రేంజ్ లో వుంటారు. ఆరు అంకెల జీతాలు తీసుకొని ఏసీ గదుల్లో కాలం వెల్లదీస్తూ రిచ్ లైఫ్ స్టయిల్ తో వుంటారు. అవసరమైనప్పుడు వాళ్ళతో ఓ రెండు గంటలు ఎక్కువ పని చేయిస్తే కొంపలేమీ అంటుకుపోవు. ఇలాంటి వార్తలు జనాల్లోకి వెళితే.. ”రాష్ట్రం సమస్యలపై జగన్ మోహన్ రెడ్డికి వున్న అవహగన అది. ఇంతకంటే ఏం మాట్లాడుతాడు. అందుకే గంటలో ఇంటికి పంపేస్తున్నాడు” అనే యాంగిల్ కూడా వస్తుంది.

అంతేకాదు.. జగన్ సిఎం అయినప్పటి నుండి ఉద్యోగులు జీతాలు… సౌకర్యాలు.. అనే పాట పాడుతున్నాడు. ఇది మంచిదే. కానీ నివురుగప్పిన నిప్పులా నిరుద్యోగ సమస్య వుంది. డిగ్రీలు చేతపట్టుకొని రోజుకి వందరూపాయిలు కూడా ఆదాయం లేక విలవిలలాడుతున్న యువకులున్నారు. పదిరూపాయిల పనికి మూడు రూపాయిలు తీసుకొని కూడా పని చేయడానికి సిద్దంగా వున్నారు. అంతేకాదు..రాష్ట్రంలో ఎటు చూసిన సమస్యలు వున్నాయి. ఇలాంటి నేపధ్యంలో లక్షరూపాయిలు జీతం వచ్చివాడికి మరో పది వేలు బోనస్ ఇస్తే.. వాడికి ఎలాంటి ఎమోషన్ వుండదు. కానీ చేయడానికి పని దొరక్క పొట్ట చేత పట్టుకున్న వాడికి పదిరుపాయిలు ఇచ్చినా మహా ప్రసాదంగా భావిస్తాడు.

ఇప్పుడు జగన్ పై జరుగుతున్న ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రచారం ఒక వర్గంలో మేలు చేయొచ్చు గాక.. కానీ ఇదే ట్రాప్ లో జగన్ పడితే.. చాలా వర్గాల్లో నుండి ఆయన దెబ్బతినక తప్పదు. అందుకే ఇలాంటి భజన విషయంలో జగన్ కాస్త జాగ్రత్తగా వుంటే మంచింది. ఎందుకంటే ఒక ఇంట్లో నలుగురు పిల్లలు వుంటే ఒకడిని ఏసీ కార్ లో స్కూల్ పంపి మిగాత ముగ్గురిని నడవడానికి చెప్పులు కూడా ఇవ్వకుండా వెళ్ళమంటే ఎలా వుంటుంది? రాష్ట్రం కూడా ఒక ఇల్లే. కుటుంబ యాజమాని చాలా జాగ్రత్తగా ఇంటిని నడపాలి. లేదంటే.. పర్యవసనాలు ఎదురుకోవాల్సివస్తుంది. సో.. మీడియా భజన విషయంలో బీ కేర్ ఫుల్ జగన్.