ఏపీలో ఇసుక వారోత్సవాలు

ఈనెల 14వతేదీ నుంచి 21వతేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.

వరదల కారణంగా రాష్ట్రంలో ఇసుక రీచ్ లు మునిగిపోవడంతో కొరత ఏర్పడింద, గత వారం రోజుల్లో పరిస్థితి మెరుగుపడిందన్నారు. వినియోగంలోకి వచ్చిన రీచ్ ల సంఖ్య 90కి పెరిగిందన్నారు. అదేవిధంగా ఇసుక సరఫరా 1.2 లక్షల టన్నులకు పెరిగిందని అన్నారు. గతంలో ఇసుక సగటు డిమాండ్ 80వేల టన్నులుగా ఉందని చెప్పారు. వచ్చే ఏడురోజుల్లో రోజువారీ సరఫరాను 2 లక్షల టన్నులకు, ఇసుక స్టాక్ పాయింట్లను 137నుంచి 180కి పెంచాలని జగన్ అధికారులను ఆదేశించారు.