సీఎం పదవిపై జానా మాట

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలో విచిత్రమైన పరిస్థితి. అందరూ సీఎం పదవి కోసం కాచుకూర్చొనే వారే. ఈ లిస్టు చాలా పెద్దది. దీని కోసం గ్రూపులు కట్టి.. తమ బలాన్ని చూపించాలని తాపత్రయ పడుతున్నారు. ఈ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి స్పందించారు. ఎవరికి వారే తాము సీఎం అవుతామనుకుంటే పదవి వచ్చే పరిస్థితి తమ పార్టీలో ఉండదన్నారు జానా. ఆయన బుధవారం భైంసాలో ఆ పార్టీ సీనియర్‌ నేత రామారావు పటేల్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలో సీఎం క్యాండిటేట్ పై స్పందించారు.

అసలైన సాగుదారులకే రైతుబంధు పథకం వర్తింపజేయాలని ఈ సందర్భంగా జానా డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలను సంప్రదించకుండా, సమావేశం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ఇక, కాంగ్రెస్ పరిస్థితి గురించి జానా చెప్పింది నిజమే. గ్రూపు తగాదాలే టీ-కాంగ్రెస్ కొంప ముంచుతున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశంలో నేతలు బాహాబాహికి దిగిన సంగతి తెలిసిందే.