జనసేన టికెట్లు కావాలా ? ఇదే లాస్ట్ డేట్

జనసేన టికెట్ల కోసం అనేకమంది ఆశావాహులు దరఖాస్తు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అభ్యర్థుల అర్హతలు తెలుసుకునేందుకు పరీక్షలు కూడా జనసేన పార్టీ… వారి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. కాగా ఎన్నికల్లో ’జనసేన’ తరపున పోటీ చేయాలనుకునే ఆశావహుల బయోడేటాల స్వీకరణకు తుదిగడువు ఈ నెల 25 వ తేదీగా నిర్ణయించినట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో చెప్పింది.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేయాలనుకున్న ఆశావహుల బయోడేటాల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీకి తమ బయోడేటాలను ఆశావహులు సమర్పించారు. ఈరోజు స్క్రీనింగ్ కమిటీకి మొత్తం 170 బయోడేటాలు అందినట్టు ఆ ప్రకటనలో తెలిపారు.