‘పిడికిలి’ చూపించిన జనసేనాధిపతి….

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తు ను తెలియజేసాడు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సభలో మాట్లాడుతూ జనసేన పార్టీ గుర్తును పిడికిలిగా నిర్ణయించినట్లు తెలిపారు. సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందన్నారు. అందుకే ఈ గుర్తును ఎంపిక చేశామని ప్రజలకు తెలిపారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు కలసికట్టుగా ఉండి బలాన్ని చాటేలా పిడికిలి చూపుతామని ఆయన అన్నారు.

అలాగే ఇదే సభలో తెలుగు దేశం పార్టీ ఫై మరోసారి నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో తనను తాను ఎన్టీఆర్‌గా పోల్చుకుంటూ వెన్నుపోటు పొడిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ బృందాలు, రౌడీలకు తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు.

‘వారికి (టీడీపీ) ఉన్నవి రెండే అవకాశాలు.. ఒకటి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయడం. నేను దానికి సిద్ధం. లేదు.. వీధుల్లోకి వస్తామంటే అందుక్కూడా సిద్ధం. అవసరమైతే కర్ర పట్టుకొని కూడా పోరాడతాం’ అని పవన్ స్పష్టం చేశారు. ఎర్రకాలువ సమస్యపై తాను ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతున్నానని ఆయన చెప్పారు.