ఎకరా భూమి రూపాయికి ఇచ్చిన కేసీఆర్.. అడిగేవాడు లేడా ??


అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తెలంగాణ భూములని స్వామీజీలకు సమర్పించుకుంటున్నారు సిఎం కేసీఆర్. ఆయనకి భక్తి ఎక్కవ. శారదాపీఠానికి వెళ్లి స్వరూపానంద సరస్వతి కాళ్ళు మొక్కుతుంటారు. అలా మొక్కితే ఎవడెం నష్టం లేదు. కానీ కోట్లు విలువలు చేసే భూములు అప్పనంగా అప్పగిస్తున్నారు. తన భక్తి ప్రపత్తులు చాటుకునేందుకు ఎకరా రూపాయి వంతున శారదాపీఠానికి రెండు ఎకరాలు భూమి ఇచ్చేశారు కేసీఆర్.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామ సర్వే నంబరు 240లో భూమిని కేటాయిస్తూ జీవోని జారీ చేసింది కేసీఆర్ సర్కార్. శారదాపీఠం ఆధ్వర్యంలో ఆలయం, వేద భాష గోష్ఠి మఠం, సంస్కృత విద్యాసంస్థ ఏర్పాటు, విద్యార్థులకు వసతిగృహం, కన్వెన్షన్‌ హాల్ ఏర్పాటు చేసేందుకు తమకు భూమిని కేటాయించాలంటూ శారదా పీఠం కోరింది. ఈ నేపథ్యంలో రెండెకరాల స్థలాన్ని కేటాయించేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. జీవీ కూడా జారీ అయ్యింది. ఈ భూమి విలువ ఎకరం రూ.12 కోట్లు పలుకుతుంది. కానీ రూపాయి తీసుకొని ఇచ్చారు.

దీనికి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ కోసం పోరాడిన ఎంతమంది ఉద్యమ నాయకులు, యువకులకు కనీసం ఇల్లు కూడా సరిగ్గా కట్టివ్వలేదు. భూములు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఓ స్వామీజీకి కోట్ల ఆస్తులు ఇవ్వడంపై తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి.